నేడు నగరంలో పర్యాటక ప్రదేశాలు బంద్‌

shilparamam
shilparamam

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలకు అధికారులు సెలవును ప్రకటించారు. మాదాపూర్‌లోని శిల్పారామానికి అదేవిధంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంతో పాటు నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లకు సెలవు ప్రకటిస్తున్నామని ఆయా విభాగాల అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని నగరవాసులు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/latest-news/