నేడే నామినేష‌న్ల‌కు ఆఖ‌రు తేదీ

nominations
nominations

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి తేదీ కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు సిద్ధమయ్యారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నామినేషన్ల దాఖలు చేసేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ప్రాంతంలో రాజకీయ సందడి నెలకొననున్నది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా సోమవారం నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి ఏర్పడనుంది.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్ లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.