టీఆర్ఎస్ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్

harish rao
harish rao


హైదరాబాద్‌: టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేరు లేకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేసీఆర్ వైఖరిపై హరీశ్ రావు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. హరీశ్‌ రావు కావాలనే దూరంపెడుతున్నారన్న ఊహాగానాలకు.. ఇది బలం చేకూర్చుతోందని ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకుంది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది.