నేడు టిఆర్‌ఎస్‌ సమావేశం

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చిస్తారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై జరుగనున్నాయి.ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది పార్టీ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/