ఐదోసారి ఒడిశా సియంగా నవీన్‌ పట్నాయక్‌!

 Naveen Patnaik
Naveen Patnaik

భువనేశ్వర్‌: ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల పోరు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ(బిజెపి), బిజు జనతాదళ్‌(బిజెడి) మధ్యనే ఉంటుందని అంతా భావించారు. ఆ అంచానలను తలకిందులు చేస్తూ బిజెడి అధినేత నవీన్‌ పట్నాయక్‌(72) రికార్డు స్థాయిలో ఐదోసారి సియం పీఠం అధిరోహించడానికి సిద్దంగా ఉన్నారు.
మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో 146 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెడి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి 29, కాంగ్రెస్‌ కూటమి 14 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో బిజెడి 14 ఎంపి సీట్లలో ముందంజలో ఉండగా, బిజెపి ఏడింట్లో ఆధిక్యంలో ఉంది. నాలుగు సార్లు సియం పీఠాన్ని అధిరోహించిన నవీన్‌పట్నాయక్‌ ఐదోసారి సియంగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/