‘మోది మళ్లీ ప్రధాని ఐతే రాజకీయాలకు స్వస్తి’

revanna, modi
revanna, modi


మైసూరు: మోది తిరిగి ప్రధాని ఐతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కర్ణాటక పిడబ్లుడి మంత్రి ,సీనియర్‌ జనతా దళ్‌ సెక్యులర్‌్‌ పార్టీ నేత హెచ్‌ డి రేవన్న అన్నారు. ఆయన మైసూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..మోది వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి దేశానికి మళ్లీ ప్రధాని ఐతే తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతానని అన్నారు. బిజెపికి దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చే సీను లేదని, ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఏలుతుందని అన్నారు. ఆయన కాంగ్రెస్‌ తరఫున మైసూరు ఎంపి అభ్యర్థి విజ§్‌ు శంకర్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రేవన్న హెచ్‌డి దేవెగౌడ కుమారుడు, మరియు కుమారస్వామి సోదరుడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/