ముంబై నార్త్‌ నుంచి ఊర్మిళ నామినేషన్‌

urmila matondkar
urmila matondkar


ముంబై : ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున రంగీల నటి ఊర్మిళ మటోండ్కర్‌ ఇవాళ తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. తాను హిందువులను అవమానించేలా వ్యాఖ్యలు చేశానంటూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన అంశంపై ఊర్మిళ స్పందించారు. తనపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు నిరాధారమని, బోగస్‌ అని ఆమె స్పష్టం చేశారు.
హిందుత్వంపై తనకు నమ్మకం ఉందన్నారు ఆమె. హిందుత్వం ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మతం అంటూ హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఊర్మిళ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.