ఎన్నికల సామగ్రిని స్వయంగా మోసిన జిల్లా కలెక్టర్‌….

anupama
anupama, Thrissur Collector

బెంగళూర్‌: కేరళలోని త్రిశూర్‌ జిల్లా కలెక్టర్‌ టి.వి అనుపమ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలో ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లాకు ఎన్నికల ఏర్పాట్లును ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సామాగ్రి ఉన్న బరువైన ట్రంకు పెట్టెలను ఓ పోలీసుతో కలిసి స్వయంగా లారీ నుంచి కింద్రకు దించి తన కార్యాలయం లోపలికి మోసుకెళ్లారు. జిల్లా కలెక్టర్‌ అధికార దర్పం లేకుండా, సాదాసీదా వ్యక్తాలా ఆమె సిబ్బందితో పాటుగా ఇలా ట్రంకుపెట్టను మోస్తున్నా విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విడియోకి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ విడియోను పలువురు ‘లైక్‌ చేయగా, పలువురు షేర్‌ చేశారు. ప్రతి అధికారికి ఆమె ఆదర్శమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలోనూ తన సింప్లిసిటీ జిల్లా కలెక్టర్‌ అనుపమ వార్తల్లో నిలిచారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/