మేనకా గాంధీకి ఈసి సంజాయిషీ నోటీసులు

maneka gandhi
maneka gandhi


సుల్తాన్‌పూర్‌: బిజెపి ఎంపి, కేంద్ర మంత్రి మేనకాగాంధీకి శుక్రవారం జిల్లా మేజిస్ట్రేట్‌ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ బిజెపి నియెజకవర్గ మైనారిటీ సెల్‌తో ప్రత్యే క సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిని ఆమె నేను గెలవడం ఖాయం, ముస్లింల మద్దతు లేకుండా గెలిస్తే విజయానికి అర్దం ఉండదు. ఇక అప్పుడు ఏదైనా పని చూపించమని ఎవవైనా ముస్లిం సోదరులు నా దగ్గరకు వస్తే నేను పట్టించుకోను అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో మేజిస్ట్రేటు క్షణ్ణంగా పరిశీలించి ఈ ఘటనపై పూర్తి నివేదికను ఈసికి సమర్పించారు. దీంతో మేజిస్ట్రేట్‌ మేనకాగాంధీకి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/