ఓటు వేసే వారిని అడ్డుకున్న తృణమూల్‌ నేతలు

agitation in bengal
agitation in bengal


రా§్‌ుగంజ్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రా§్‌ుగంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
దినాజ్‌పూర్‌లో జిల్లాలోని ఇస్లాంపూర్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. చోప్రాలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తమను ఓటు వేయకుండా తృణమూల్‌ నేతలు అడ్డుకున్నారని, పోలింగ్‌ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని స్థానికులు ఆరోపించారు. వారికి సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/