స్టాలిన్‌ సియం కావాలని తమిళుల ఆశ

chandra babu, stalin
chandra babu, stalin


చెన్నై: డిఎంకే అధ్యక్షుడు, కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను సియంగా చూడాలనేది ప్రజల కోరికని ఏపి సియం చంద్రబాబు అన్నారు. మంగళవారం చెన్నైకి వచ్చిన ఆయన డిఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటి అయ్యారు. అనంతరం డిఎంకే ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబు మాటాడుతూ..అన్నాడిఎంకేకు ఓటేస్తే మోదికి వేసినట్లేనని అన్నారు. జల్లికట్లుపై నిషేధం విధించి మోది తమిళ సంస్కృతిని అవమానపరచారని విమర్శించారు.
కొన్ని ఈవిఎంల పనితీరు సరిగా లేదని సీఈసి చెబుతుందని, అలాంటపుడు వాటిని ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణిలో ఈసి వ్యవహరించిందని, ఈసికి ఎన్నికలు నిర్వహించడం మీద కన్నా, రాజకీయాలు చేయడం, నేతలు చెప్పినట్లు తలాడించడంపై శ్రద్ధ ఎక్కువని విమర్శించారు.
దేశంలో పరిపాలనా యంత్రాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కూడా..మోది దుర్వినియోగం చేసి అడ్డగోలుగా గెలవాలనుకుంటున్నారని, మేము అలా జరగన్విమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/