సుమలత, నిఖిల్‌ వర్గీయుల మధ్య ఘర్షణ

nikhil kumara swamy, sumalatha
nikhil kumara swamy, sumalatha


మాండ్య: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఉద్రిక్తతలు, ఘర్షణలు మధ్య కొనసాగుతుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని రా§్‌ుగంజ్‌లో ఓటర్లు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. మాండ్య అభ్యర్ధులు సుమలత, నిఖిల్‌ కుమారస్వామి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
మాండ్యలో గెలుపు విషయంలో సుమలత, నిఖిల్‌ వర్గీయులు పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి అది ఘర్షణకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గీయులు దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/