మెహబూబా ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Mehbooba Mufti
Mehbooba Mufti


శ్రీనగర్‌: పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకాశ్మీర్‌ మాజీ సియం మెహబూబా ముఫ్తీ కాన్వాయ్‌ పై ఇవాళ రాళ్ల దాడి జరిగింది. అనంతనాగ్‌ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌ వెళ్లి అక్కడ్నుంచి బిజ్‌బెహ్రాకు తిరిగివస్తున్నపుడు కాన్వాయ్‌ పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ఈ ఎన్నికల్లో అనంతనాగ్‌ నుంచి ఆమో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/