అమేథిలో నామినేషన్‌కు ముందు స్మృతి ఇరానీ పూజలు

smriti irani, zubin irani
smriti irani, zubin irani


అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల వేళ తన నామినేషన్‌ పత్రాలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేయనున్నారు. ఐతే జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయానికి వెళ్లే ముందు తన భర్తతో కలిసి పూజ నిర్వహించారు. ఇరానీ కూడా నామినేషన్‌కు ముందు రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇరానీతో పాటు రోడ్‌ షోలో ఆమెకు మద్దతుగా యుపి సియం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ఐతే ఆమె ఏప్రిల్‌ 17న నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది కానీ ఆ రోజు మహావీర్‌ జయంతి సందర్భంగా సెలవుదినం కావడంతో తేదీ మార్చబడిందని స్థానిక బిజెపి నాయకుడు దుర్గేష్‌ త్రిపాఠి అన్నారు. 2014 ఎన్నికల్లో రాహుల్‌పై ఆమె విజయం సాధించారు. ఆమె గత నెలలో అమేథి నియోజకవర్గంలో మోది చేత అస్సాల్ట్‌ రైఫిల్‌ తయారీ యూనిట్‌ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభింపచేసింది. రెండు స్థానాల్లో పోటీ చేయాలన్న రాహుల్‌ గాంధీ నిర్ణయంతో ఇరానీకి అమేథిలో గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/