గత 20 రోజుల్లో 377 కోట్లు స్వాధీనం

election commission
election commission


న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులు అన్ని చోట్లా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమలు రోజు నుంచి ఇప్పటి వరకు రూ. 377 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రూ. 157 కోట్ల విలువ చేసే మద్యం , రూ. 705 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు, రూ. 312 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్‌ సమయంలో రూ. 50వేల కంటే ఎక్కువ తరలిస్తే దానికి సంబంధించిన ఆధారాలు అధికారులకు చూపాల్సి ఉంటుంది. లేని యెడల ఆ నగదును అధికారులు సీజ్‌ చేస్తారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/