రాహుల్‌ ప్రసంగాలు ప్రజల్లో స్పూర్తి కలిగించవు

rahul, priyanka
rahul, priyanka

ముంబై: తాజా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చెందడంపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధ్యక్షడు రాహుల్‌ది ప్రజల్ని ఆకర్షించే వ్యక్తిత్వం కాదని, ఆయన ప్రసంగాలు కూడా స్పూర్తిని కలిగించేలా ఉండవని, అందుకే మరి కాంగ్రెస్‌కు ప్రజలు ఎలా పట్టం కడతారని సోమవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసం రాశారు.
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ దిక్కుతోచని స్థితిలో ఉందని శివసేన విమర్శించింది. అలాగే కాంగ్రెస్‌లో నాయకులు అనేక మంది ఉన్నారని కానీ, కార్యకర్తలే కరవయ్యారని ఎద్దేవా చేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో యూపిలో కనీసం రెండు సీట్లన్నా కాంగ్రెస్‌ గెలుచుకుందని, ప్రియాంక ప్రవేశం తరవాత ఆ మాత్రం కూడా దక్కలేదని వ్యాఖ్యానించింది. ఈ 23న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/