రెండంకెల వృద్ది సాధించేందుకు మోది అజెండా!

modi
modi, pm


న్యూఢిల్లీ: మొదటి దశ ఎన్నికలు ఇలా పూర్తయ్యాయో లేవో అప్పుడే మోది తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులను కోరినట్లు తెలుస్తుంది. రానున్న ఐదేళ్లలో రెండంకెల వృద్ది సాధించేందుకు అజెండా రూపొందించాలని పిఎంఓ, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌, కేంద్ర సాంకేతిక ప్రధాన సలహాదారును కోరినట్లు సమాచారం. ప్రముఖ రంగాలైన ఆయిల్‌-నేచరల్‌ గ్యాస్‌, ఖనిజాలు, మౌలిక వసతులు, విద్యారంగాల్లో ఉన్న సంక్లిష్టతలను తొలగించడంపై దృష్టి సారించాం అని దీని ద్వారా 2047 నాటికి భారత్‌ అభివృద్ది చెందిన దేశంగా అవతరించడానికి అవసరమైన పునాదుల్ని రానున్న రోజుల్లో వేయాలని సంకల్పించామని, కీలక రంగాల్లో సంక్లిష్టతలను తొలగించడం ద్వారా 2.5 శాతం మేర వృద్దిరేటు పెంచగలమని భావిస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
దేశం మొత్తం ఎన్నికలపై దృష్టి సారిస్తుంటే..పిఎంఓ, నీతి ఆయోగ్‌, శాస్త్ర సాంకేతిక రంగాలు మాత్రం అజెండా రూపకల్పనలో తలమునకలైనట్లు సమాచారం. దీంట్లో భాగంగా పర్యాటకం, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలు ఇలా పలు రంగాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/