తెలివిగా ఆలోచించి ఓటు వేయండి

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు ట్విటర్‌ వేదికగా ఓటర్లకు సందేశాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ స్పందిస్తూ..ఖఖ రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు, అచ్ఛే దిన్‌ ఇవేవీ లేవు. నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతుల బాధలు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌, సూట్‌ బూట్‌ సర్కార్‌, రఫేల్‌, అబద్ధాలు, హింస, ద్వేషం, భయం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి తెలివిగా ఓటు వేయండిగగ అని రాహుల్ ట్విటర్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. లాగే కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌లోనూ ప్రజలకు ఓటు విలువను గుర్తుచేస్తూ ఆ పార్టీ సందేశమిచ్చింది.ఖఖఈ రోజు మీరు ద్వేషంపై ప్రేమను, పకోడాలపై ఉద్యోగాలను, ప్రచారాలపై పథకాలను, విభజనపై ఐక్యతను ఎన్నుకోండిగగ అని పోస్ట్‌ చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/