నాలుగో దశ ఎన్నికలకు నోటిఫీకేషన్‌ విడుదల

election commission of india
election commission of india

న్యూఢిలీ: ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ఈరోజు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 29న పోలింగ్‌ జరగనుంది. ఈరోజు నుండి ఏప్రిల్‌ 9 వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 10న నామపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఏప్రిల్‌ 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. నాలుగో విడతలో భాగంగా బిహార్‌లోని 5 స్థానాలకు, ఝార్ఖండ్‌లోని 3, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్రలోని 17, ఒడిశాలోని 6, రాజస్థాన్‌లోని 13, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమబెంగాల్‌లోని 8 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/