మే 23న విప‌క్షాల క‌ల‌ల‌న్నీప‌టాపంచ‌లు

shiv sena
shiv sena

న్యూఢిల్లీః: బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న ప్ర‌తిప‌క్షాలపై శివ‌సేన మండిప‌డింది. మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే లోపు ప్ర‌తిప‌క్షంలోని పార్టీల‌న్నీ విడిపోతాయ‌ని శివ‌సేన పేర్కొన్న‌ది. సామ్నా ప‌త్రిక‌లో శివ‌సేన ఈ అభిప్రాయాన్ని వినిపించింది. చిన్న‌పార్టీల‌ను జ‌త చేసుకుని జ‌ట్టు క‌డుదామ‌నుకుంటున్న ప్ర‌య‌త్నాల‌న్నీ వీగిపోతాయ‌ని శివ‌సేన హెచ్చ‌రించింది. అటూ ఇటూ తిరుగుతూ చంద్ర‌బాబు ప్ర‌యాస‌ప‌డుతున్నార‌ని శివ‌సేన పేర్కొన్న‌ది. మ‌హాకూట‌మి నుంచి క‌నీసం అయిదు మంది ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నార‌ని, వారి క‌ల‌ల‌న్నీ ప‌టాపంచ‌లు కాబోతున్న‌ట్లు సామ్నా త‌న ఎడిటోరియ‌ల్‌లో తెలిపింది. చిన్న చిన్న పార్టీల కూట‌మితో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి లేద‌ని సామ్నా చెప్పింది. ఎన్నిక‌ల త‌ర్వాత అస్థిర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, దాని నుంచి లాభం పొందేందుకే చంద్ర‌బాబు ఢిల్లీలో క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని, కానీ అది నిజం కాదు అని సామ్నా తెలిపింది. చంద్ర‌బాబు కూట‌మి కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయ‌ని,ఆ కూట‌మి 23వ తేదీ వ‌ర‌కు క‌లిసి ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని శివ‌సేన ప‌త్రిక వెల్ల‌డించింది.

తాజా జాతీయ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/