మోసగాళ్లకు మోది సహకారం!

rahul gandhi
rahul gandhi


చెన్నై: ప్రధాని నరేంద్ర మోది ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. దేశంలోని పదిహేను మంది మోసగాళ్ల కోసమే మోది ఈ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రముఖులలో కొందరు మోహల్‌ చోక్సీ, నీరవ్‌ మోది, విజ§్‌ు మాల్యా, అనిల్‌ అంబానీ అని తెలిపారు. నీరవ్‌ మోదికి రూ. 3,50,000 కోట్లు, విజ§్‌ు మాల్యాకు రూ. 10 వేల కోట్లు, చోక్సీకి రూ.35 వేల కోట్లు కట్టబెట్టారని చెప్పారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా జైలులో లేరని, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని ధ్వజమెత్తారు. రైతులు రుణాలు చెల్లించకపోతే వారిని జైల్లో వేస్తారు కాని ..ధనవంతులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొడితే మాత్రం జైల్లో వేయరు అని రాహుల్‌ మండిపడ్డారు. కాని అభం శుభం తెలియని రైతులను మాత్రం మోది నిర్లక్ష్యం చేస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ పెడతామని అన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/