మోది బయోపిక్‌ విడుదల నిర్ణయం ఈసిదే!

modi biopic
modi biopic


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోది జీవితాధారంగా తెరకెక్కిన పిఎం నరేంద్ర మోది బయోపిక్‌కు సుప్రీంలో కొంత ఊరట లభించింది. ఎన్నికల ముందు బయోపిక్‌ను విడుదల చేయడానికి వీల్లేదని విపక్షాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం తాజాగా తీర్పునిస్తూ.. సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని వెల్లడించింది. సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా ? అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందని తెలిపింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఏప్రిల్‌ 5నే విడుదలయ్యేది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/