తమిళనాడుకు కాబోయే సియం స్టాలినే!

తమిళనాడులో కాంగ్రెస్‌తో డిఎంకే పొత్తు

rahul gandhi
rahul gandhi


చెన్నై: తమిళనాడు సియం ఎంకే స్టాలినే అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కృష్టగిరిలో ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ..తమిళనాడుకు స్టాలిన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని రాహుల్‌ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-డిఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానం ఉంది. మొత్తం 40 సీట్లలో కాంగ్రెస్‌ 10 స్థానాల్లో (తమిళనాడు 9, పుదుచ్చేరి 1) పోటీ చేస్తుంది. మిగిలిన 30 స్థానాల్లో డిఎంకే తమ అభ్యర్ధులను బరిలోకి దింపింది. కాగా, అన్నాడిఎంకే, బిజెపి, పిఎంకే కలిసి మహాకూటమిగా ఆవిర్భవించాయి. మొత్తం 40 ఎంపి స్థానాల్లో బిజెపి 5, పిఎంకే 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మిగిలిన 29 స్థానాల్లో అన్నాడిఎంకే పోటీ చేస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/