బిఎస్‌పి టికెట్లు అమ్ముకుంటున్న మాయావతి

ఎన్నికల ర్యాలీలో మేనకగాంధీ ధ్వజం

menka gandhi
menka gandhi

సుల్తాన్‌పూర్‌: బిజెపి అధినేత్రి మాయావతి లోక్‌సభ అభ్యర్ధులకు టికెట్లను ఒక్కొక్కస్థానానికి రూ.15 నుంచి రూ.20 కోట్లకు అమ్ముకున్నారని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గ బిజెపి అభ్యర్ధి మేనకాగాంధీఆరోపించారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని మాయావతి పార్టీ టికెట్లను అమ్ముకుంటారని పార్టీ సభ్యులు అందరికీ తెలుసునని కొందరు బహిరంగంగానే విమర్శిస్తారని వెల్లడించారు. ఆమెకు 77 ఇళ్లు ఉన్నాయని, ఈ ఇళ్లల్లో నివసించేవారు కూడా టికెట్లు అమ్ముకుంటున్న అంశం చెపుతారని వెల్లడించారు. ఒక్కొక్క స్థానానికి 15-20 కోట్లు డిమాండ్‌చేసి మరీ వసూలుచేస్తారని, ఈ మొత్తం వజ్రాల రూపంలో కానీ నగదురూపంలో కానీ ఉంటుందని మేనకగాంధీ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ విమర్శల దాడిచేసారు. ఎవరైతే బిజెపి సభ్యులు పార్టీ టికెట్లు కొనుగోలుచేసారో వారంతా ఆమెకు గులాములేనని, వారంతాదోపిడీ దొంగలని వెల్లడించారు. ఈ సొమ్మును సామాన్య మానవులనుంచి దోపిడీచేసిందేనన్నారు. ఈ సాయుధ దుండగులకు ఈ 15-20 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని, మాయావతికి ఇంతభారీ మొత్తం ముట్టచెప్పడానికి ఏంచేసారని ప్రశ్నించారు. ఇదంతా సామాన్య మానవులకు చెందినది కాదా అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడుదశల్లో జరుగుతున్న పోలింగ్‌లో సుల్తాన్‌పూర్‌నుంచి బిజెపి అభ్యర్ధిగా మేనకగాంధీ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకుమారుడు వరుణ్‌గాంధీ కూడా పిలిభిత్‌నియోజకవర్గంనుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/