క్యూలో వెళ్లకుండానే ఓటేసిన సియం, గవర్నర్‌

najma heptulla, biren singh
najma heptulla, biren singh


ఇంఫాల్‌: ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినపుడు సామాన్య ప్రజలతో పాటే క్యూలైన్‌లో వేచిఉండి తమ వంతు వచ్చినపుడు ఓటు వేసి వెళ్తున్నారు. ఐతే మణిపూర్‌ గవర్నర్‌, సియం మాత్రం క్యూలైన్‌లను దాటుకుని వెళ్లి ఓటేసినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలో రెండో విడతలో భాగంగా ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నేడు పోలింగ్‌ జరుగుతుంది. సగోల్‌ బంద్‌ ప్రాంతంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా క్యూలైన్‌లో నిల్చోకుండానే నేరుగా లోపలికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హెయిన్‌గంగ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో సియం బీరెన్‌సింగ్‌ తన భార్యతో వచ్చి వినియోగించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/