గుల్బర్గా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్‌

mallikarjun kharge
mallikarjun kharge


బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే గుల్బర్గా ఎంపి స్థానానికి ఇవాళ నామినేషన్‌ వేశారు. తన నామినేషన్‌ పత్రాన్ని ఎన్నికల అధికారికి ఖర్గే అందజేశారు. కర్ణాటక అసెంబ్లీకి పది సార్లు పోటీ చేయగా, వరుసగా తొమ్మిది సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1972లో తొలిసారిగా గుర్మిత్‌కల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/