నకుల్‌నాధ్‌ ఆస్తులు రూ.660 కోట్లు

nakul nath
nakul nath


చింద్వారా(ఎంపి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌కుమారుడు నకుల్‌నాధ్‌ ఆస్తులు 660.01 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. అఫిడవిట్‌లో ఆయన పొందుపరిచిన వివరాలు గత ఎన్నికలతో పోలిస్తే పెరిగాయి. అలాగే సిఎం కమల్‌నాధ్‌ అఫిడవిట్‌ను పరిశీలిస్తే రూ.124 కోట్లకు పైబడి ఉన్నాయి. స్థిరచరాస్తులు మొత్తంగా కలుపుకుని వెల్లడించారు.నకుల్‌నాధ్‌ వ్యాపారవేత్తగా రాణించి అనంతరం రాజకీయ వేత్తగా వచ్చారు. చరాస్తులు సుమారు 615.93 కోట్లు విలువైనవిగా ఉన్నాయి. తన భార్య ప్రియానాధ్‌ ఆస్తులు రూ.2.30 కోట్లకుపైబడి ఉన్నట్లు అఫిడివట్‌లో వెల్లడించారు. ఆయన స్థిరాస్తులు చూస్తే రూ.41.77 కోట్లుగా ఉనానయి. ఆయన భార్యకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. నకుల్‌నాధ్‌ తన ఆస్థులు అన్నీ తన సొంతపేరుమీద, జాయింట్‌ ఆస్తులుగా కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ పర్యవేక్షణలో ట్రస్టులు, కంపెనీల ఆధ్వర్యంలో ఉన్నాయి. నకుల్‌నాధ్‌, ప్రియానాధ్‌లకు ఎలాంటి వాహనాలు లేవు. అంతేకాకుండా 896.669 గ్రాముల బంగారు కడ్డీలు, 7.630 కిలోల వెండి, 147.58 కేరట్ల డైమండ్‌, ఇతర విలువైన రాళ్లఆభరణాలు సుమారు 78.45 లక్షల విలువైనవి ఉన్నాయి. ఆయన భార్యకు 270.322 గ్రాముల బంగారం, 161.84 కేరట్‌ డైమండ్‌స్టోన్‌ ఆభరణాలు వాటి విలువ 57.62 లక్షలుగా ఉన్నాయని వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్నులను చూస్తే 2017-18ల్లో నకుల్‌నాధ్‌ వార్షిక ఆదాయం 2.76 కోట్లుగా ఉంది. ఆయన భార్య ఆదాయవనరులు రూ.4.18 కోట్లుగా ఉంది. అంతేకాకుండా వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, కంపెనీల్లో వాటాలు, సంస్థలు, ఐఎంటి దుబాయి, షార్జా క్యాంపస్‌లలో స్పాన్‌ ఎయిర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థల్లో కూడా ఆయనకు వాటాలున్నాయి. నకుల్‌నాధ్‌ ఆయన సోదరుడు సంయుక్తంగా చింద్వారా జిల్లాలో 7.82 ఎకరాల స్థలం ఉంది. నకుల్‌నాధ్‌ చింద్వారా నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్నారు. బిజెపి అభ్యర్ధి నత్తన్‌షాఆయనపై పోటీచేస్తున్నారు. నకుల్‌నాధ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ ఉంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ బోస్టన్‌లోని బే స్టేట్‌ కళాశాలనుంచి ఆయన డిగ్రీపొందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/