జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు..ఆజంఖాన్‌పై కేసు

Azam Khan , Jaya Prada
Azam Khan , Jaya Prada


రాంపూర్‌: ప్రముఖనటి, బిజెపి లోక్‌సభ అభ్యర్ధి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టి సీనియర్‌ నేత ఆజంఖాన్‌ అసభ్యవ్యాఖ్యలు చేశారు దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ మహిళా కమీషన్‌ నోటీసులు జారీ చేసింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గంలో జయప్రదకు ప్రత్యర్ధిగా ఆజంఖాన్‌ పోటీ చేస్తున్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో జమప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి(జయప్రదను ఉద్ధేశిస్తూ)ని తానే రాంపూర్‌కి పరిచయం చేశానని, ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నానని,కాని ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడిందని, జయప్రద ఖాకీ నిక్కర్‌ వేసుకున్నారంటూ అభ్యంతరంగా మాట్లాడారు.
ఆయన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ మహిళా కమీషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈసికి మహిళా కమీషన్‌ లేఖ రాసింది.
దీనిపై ఆజంఖాన్‌ స్పందిస్తూ..తాను తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఏం మాట్లాడాలో తనకు అవగాహన ఉందని, ఏ వ్యక్తిని ఉద్ధేశించి గానీ, అవమానించేందుకు గానీ ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఒకవేళ తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆజంఖాన్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/