వెల్లూర్‌ ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో ఈసి!

vellore elections 2019
vellore elections 2019


వెల్లూర్‌: తమిళనాడులోని వెల్లోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది. ఇటీవల ఆ నియోజకవర్గంలోని డిఎంకే అభ్యర్ధి ఇంటి నుంచి సంచుల సంచులు డబ్బు డబ్బు తరలిస్తున్నపుడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిక రద్దు చేయాలన్న ప్రతిపాదనను ఈసి, రాష్ట్రపతికి చేరవేసింది. ఇక రాష్ట్రపతి నిర్ణయం మీదే వెల్లూర్‌ ఎన్నికలు భవితవ్యం ఆధారపడి ఉంది. ఏప్రిల్‌ 18న జరగనున్న రెండం దశలో వెల్లూర్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. ఐతే వెల్లూర్‌లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/