యడ్యూరప్ప లగేజి చెక్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

హైదరాబాద్: కర్ణాటక మాజీ సియం బిఎస్ యడ్యూరప్పను ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ చెక్ చేసింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం శివమొగ్గ నుంచి వెళ్తున్న మాజీ సియం యడ్యూరప్ప లగేజిని ఫ్లయింగ్ స్వ్కాడ్ పరిశీలించింది. ఇటీవల కర్ణాటకలో మోది ప్రయాణించిన హెలికాప్ట్టర్ నుంచి నల్లటి ట్రంకు పెట్టెని తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బిజెపి నేతలు ఆ పెట్టులో డబ్బులు తరలించారని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు ఇవాళ జేడిఎస్ నేతల ఇళ్లల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సియం కుమారస్వామి కారును కూడా చెక్ చేసిన విషయం తెలిసిందే.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/