నమో టివిలో రాజకీయ ప్రచారం నిషేధం

NAMO tv
NAMO tv


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది ప్రసంగాలు, బిజెపి అనుకూల వార్తలను ప్రచారం చేస్తున్న నమో టివిపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ సంబంధమైన సమాచారాన్ని ప్రసారం చేయరాదు అని ఈసి స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం ఐన సర్టిఫికేట్‌ పొందిన తర్వాతనే ప్రసారం చేయాలని ఈసి చెప్పింది. సర్టిఫికేట్‌ లేకుండా ప్రసారం అవుతున్న రాజకీయ ప్రచార సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఈసి ఆదేశించింది. నమో యాప్‌లో భాగంగానే నమో టివిని నడుపుతున్నట్లు బిజెపి తెలిపింది. గత నెల నుంచి అకస్మాత్తుగా శాటిలైట్‌ టివి నెట్‌ వర్క్స్‌ నమోటివిని ప్రసారం చేస్తున్నాయి. దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/