శివసేనలోకి ప్రియాంక చతుర్వేది

priyanka chaturvedi
priyanka chaturvedi

ముంబై: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది …శివసేన తీర్ధం పుచ్చుకున్నారు. శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే సమక్షంలో ప్రియాంక పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ..గతంలో చేసిన ప్రకటనలకు ,అభిప్రాయాలకు జవాబుదారీగా వ్యవహరిస్తాను. బాగా ఆలోచించిన తర్వాతే శివసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ప్రియాంక స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీకి ఆమె తన రాజీనామా లేఖను పంపించారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos