సుపరిపాలనపై కాంగ్రెస్‌ మానుంచే నేర్చుకోవాలి

Rajnath Singh
Rajnath Singh

న్యూఢఙల్లీ,: కాంగ్రెస్‌ పార్టీ సుపరిపాలన విధివిధానాలను బిజెపినుంచి నేర్చుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ హితవుపలికారు. భారత్‌ప్రపంచదేశాల్లో శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనేలేవని, ఏ కేంద్ర మంత్రిపైనా కూడా లేవని, నరేంద్రమోడీ ప్రభుత్వ పాలన తీరుకు ఇదొక నిదర్శనమని కేంద్ర మంత్రి వెల్లడించారు. బిజెపిఎంపి విజ§్‌ు తంటా తరపున ప్రచారంచేసేందుకు వచ్చిన ఆయన అల్మోరా ఎస్‌సి నియోజకవర్గంలోప్రచారం ముమ్మరంచేసారు. అభివృద్ధి అంశంలో కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ రాజకీయాలుచేస్తూనే ఉందని వెల్లడించారు. భారత్‌ 2013 ప్రపంచ దేశాల్లో 11వ ర్యాంకుతో నిలిచిందని, ఇపుడు ఆరోస్థానానికి అధిగమించిందని అన్నారు. వచ్చే ఐదారునెలల్లోనే ఐదోర్యాంకులోనికి పెరుగుతుందన్నారు. ఇదే తీరు అభివృద్ధి కొనసాగితే భారత్‌ ప్రపంచంలోనే 2028 నాటికి మూడో అతిపెద్ద దేశంగా నిలుస్తుందని ఆయన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. ఇపుడు ప్రభుత్వం ఎలా నడిపించాలి అన్న పాలన విధానాలను బిజెపినుంచి నేర్చుకోవాల్సి ఉందని, నరేంద్రమోడీ ప్రభుత్వంలోనొ ఏ ఒక్క కేంద్ర మంత్రిపైనా ఒక్క అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. రాజీవ్‌గాంధీ ప్రకటించిన కనీసాదాయ పథకంపై ఆయన మాట్లాడుతూ కేవలం ఐదుకోట్ల కుటుంబాలను మాత్రబమే పేదరికంనుంచి బైటపడేస్తాయని, ఈపేదరిక నిర్మూలన నినాదం మొట్టమొదట జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచే వచ్చిందని, ఆ తర్వాత ఇందిరాగా:దీ, రాజీవ్‌గాంధీలు కొనసాగించారని అన్నారు. ఇపుడు అదే నినాదాన్ని మళ్లీ రాహుల్‌ గాంధీ తిరిగి కొనసాగిస్తున్నారని, ఏడాదికి 72 వేల రూపాయలు ప్రతి పేద వ్యక్తి బ్యాంకుఖాతాకు జమచేస్తామని చెపుతున్నారన్నారు.పేదరిక నిర్మూలన అన్న కాంగ్రెస్‌ నినాదం భూటకమని పేర్కొన్నారు. అమెరికన్‌ మేధావులు చెప్పిన సామెతను గుర్తుచేస్తూ 2015లో దేశంలో నిరుపేదలు 16.5కోట్లమంది ఉంటే ఇపుడు కాస్తా ఐదు కోట్లమందికి తగ్గారని ఉటంకించిన అంశాన్ని ప్రస్తావించారు. పేదరిక నిర్మూలనకు మోడీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో చేపట్టిన కార్యచరణవల్లనే ఆర్దిక సుస్థిరత సాధ్యం అయిందని, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు వంటిప్రపంచ ఆర్ధికసంస్థలుసైతం భారత్‌ శరవేగంగా అభివృద్ధిచెందుతునన దేశాల్లో కొటిగా నిలిచిందని కితాబునిచ్చాయని సింగ్‌ వెల్లడించారు. బిజెపి నాయకుడు మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని, అదే మోడీ ఐదేళ్లకాలంలో 1.30 కోట్ల ఇళ్లను నిర్మించామని గుర్తుచేసారు.గడచిన 55 ఏళ్లలో 47శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్ల నిర్మానం జరిగిందని, మోడీ ప్రభుత్వం 98శాతం ఇళ్లకు గడచిన ఐదేళ్లలో మరుగుదొడ్లు నిర్మించిందని అన్నారు. కేంద్ర మంత్రి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిత్రివేంద్ర సింగ్‌రావత్‌ను ప్రశంసించారు. కేంద్ర ఆయుష్మాన్‌భారత్‌పథకం ప్రారంభించడానికిముందే రాష్ట్రంలో బీమా పథకం అమలుచేసారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం శరవేగంగా వృద్ధిని సాధిస్తోందని అన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి మరింత వేగవంతం అఈవుతుందన్నారు. అల్మోరా ఎస్‌సి నియోజకవర్గంలో బిజెపి అజయ్తంటా పోటీచేస్తుందే ప్రధాన కాంగ్రెస్‌ ప్రత్యర్ధి రాజ్యసభ ఎంపి ప్రదీప్‌ తంటాకు పోటీగా నిలిచారు.


మరిన్నీ తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/national/