బిజెపి నేతపై ఎఫ్‌ఐఆర్‌కు ఈసి ఆదేశం

babul supriyo
babul supriyo, bjp leader

కోల్‌కత్తా: కేంద్రమంత్రి, బిజెపి నేత బాబుల్‌ సుప్రియో అసన్‌సోల్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి పోలింగ్‌ సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డ ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్‌ పోలీసులకు ఎన్నికల కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపిగా బాబుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా సోమవారం నియోజకవర్గంలోని 199వ బూత్‌లోకి చొరబడి పోలింగ్‌ సిబ్బందితో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.
ఐతే ఇదే పోలింగ్‌ బూత్‌ వద్ద పోలీసులకు తృణమూల్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం బాబుల్‌ సుప్రియో కూడా ఇక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో ఈసికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈసి ఆదేశించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/