పోలింగ్‌ అధికారులపై బిజెపి కార్యకర్తల దాడి

polling officer
polling officer


లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో బిజెపి కార్యకర్తలు చేయి చేసుకున్నారు. విధుల్లో ఉన్న పోలింగ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 231లో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి..సైకిల్‌ గుర్తుపై మీట నోక్కాలని ఓటర్లకు సూచిస్తున్నారని బిజెపి కార్యకర్తలు పేర్కొన్నారు. సమాజ్‌ వాదీ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు సూచించినందుకే దాడి చేశామని బిజెపి కార్యకర్తలు చెబుతున్నారు. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/