భాజపా, కాంగ్రెస్‌ పోటాపోటీ మేనిఫెస్టోలు

BJP Versus CONGRESS
BJP Versus CONGRESS

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న వేళ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఓటరును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకల్ప్‌ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. అంతకు ముందే కాంగ్రెస్‌ పార్టీ న్యా§్‌ు ప్రధాన అంశంగా విడుదల చేసిన మేనిఫెస్టోకు చాలా వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలేంటి ? ఏ పార్టీ హామీలు ఏ వర్గాలను ఆకర్శించే అవకాశం ఉందో ఓసారి పరిశీలిద్దాం… ఆధునిక భారత నిర్మాణం జరగాలని కోరుకుంటున్న ప్రధాన మంత్రి మోడీ బీజేపీ మేనిఫెస్టోలో నవభారత్‌, దేశ భద్రతకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మెట్రో నెట్‌వర్క్‌ కింద 50 నగరాలను చేర్చడమే కాదు, రహదారుల విస్తరణకు భారత్‌ మాల 2.0కింద రాష్ట్రాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సైనిక దళాల బలోపేతం కోసం అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లు, ఈశాన్యంలో చొరబాట్టు అడ్డుకోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దుకు చర్యలు ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. కశ్మీర్‌లో శాంతి స్థాపన జరిగే విధంగా చర్యలు తీసుకుంటామంది. ఇక సామాన్యులే ఎజెండాగా ఏ పార్టీ ఎలా హీమీలు ఇచ్చిందంటే…కాంగ్రెస్‌ పార్టీ పేదరికాన్ని నిర్మూలించి పేదలు గౌరవప్రదంగా జీవించేలా కనీస ఆదాయ పథకం, న్యూన్‌తమ్‌ ఆదా§్‌ు యోజన (న్యా§్‌ు) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకంలో ఏటా నిరుపేదలకు రూ. 72 వేలు ఇస్తారు. ఈ పథకం కిందకు దేశంలోని 20 శాతం నిరుపేదలు వస్తారు. ఈ డబ్బులను నేరుగా గృహిణుల ఖాతాలోనే జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్యను వచ్చే ఐదేళ్లలో సింగిల్‌ డిపాజిట్‌కు తీసుకు వచ్చేలా చర్యలు చేపడతామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన 80 కోట్ల మందికి సబ్సిడీ ధరకు చక్కెరను అందిస్తామని హామీ ఇచ్చింది. రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతామని ప్రకటించింది. రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికయ్యే పెట్టుబడి తగ్గించే చర్యలు. రైతులకు సంస్థాగత రుణాలు ఇస్తామని హామీల జల్లులు కురిపించింది. వ్యవసాయాభివృద్ది, ప్రణాళికల కోసం శాశ్వతంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. బీజేపీ కూడా మేనిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేసింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏటా రూ. 6 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పించన్‌ పథకం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై లక్ష వరకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా రూ. 25 లక్షల కోట్లు కేటాయిస్తామంది.
యువతకు రెండు పార్టీల గాలం
ఇక దేశంలో అత్యధిక సంఖ్యలో సంఖ్యలో ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు భారీ సంఖ్యలో హామీలు గుప్పించాయి. యువతలో నిరాశ, నిస్పృహలను పోగొట్టడానికి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. పబ్లిక్‌, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యమని పేర్కొంది. 2020 మార్చి నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ యువతను ఆకట్టుకోవడానికి పారిశ్రామిక రంగాన్ని ఎంచుకుంది. స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహకానికి రూ. 20 వేల కోట్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే 22 అతి పెద్ద రంగాలలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. యువ పారిశ్రామిక వేత్తలకు కంపెనీ స్థాపనకు పూచీకత్తు లేకుండా రూ. 50 లక్షల రుణసదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోగ్య రంగానికి సైతం అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఉచితంగా వైద్య పరీక్షలు, ఔట్‌ పేషెంట్‌ కేర్‌, ఉచితంగా మందుల పంపిణీ వంటి వన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్‌ ద్వారా చేస్తామని హామీ ఇచ్చింది. 2023-24 నాటికి ఆరోగ్య రంగంపై వెచ్చిస్తున్న నిధుల రెట్టింపు, స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 శాతం నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా లక్షా 50వేల ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు టెలీ మెడిసిన్‌, డయాగ్నస్టిక్‌ ల్యాబరేట రీల ఏర్పాటు ఇక పేదలు ఆరోగ్యానికి ఎంత వరకు ఖర్చు పెడతారో అనేది అంచనా వేసుకుని వైద్య సదుపాయాల అంశంలో వారికి ప్రత్యేకంగా ధరల నిర్ణయించారు. ఇక విద్యా రంగానికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 2023-24 నాటికి విద్యా రంగ కేటాయింపుల్ని రెట్టింపు చేస్తూ, జీడీపీలో 6 శాతం కేటా యిస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ సైతం విద్యా ర్థుల పరిశోధనలకు వీలుగా సైంటిఫిక్‌ ల్యాబ్స్‌, టెక్నలాజికల్‌ సంస్థలకు సహకారం అందించే పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లు 2024 నాటికి మరో 200 కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆప్‌ ఇండియాలో కొన్ని జర్నల్స్‌కు ఉచితంగా యాక్సెస్‌ కల్పిస్తామని హామీ ఇచ్చింది.