పాక్‌ జాతాపిత గాంధీ, బిజెపి నేత సస్పెన్షన్‌

Anil Saumitra
Anil Saumitra

న్యూఢిల్లీ: బిజెపి అధికార ప్రతినిధి అనిల్‌ సౌమిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ జాతిపిత మహాత్మా గాంధీ అని పేర్కొంటూ అనిల్‌ తన ఫేస్‌బుక్‌ పేజిలో పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలతో పాటు భారత్‌లో ఎంతో మంది గాంధీలు జన్మించారని, కొందరు దేశానికి ఉపయోగపడ్డారని, కొందరు ఉపయోగపడలేదని అనిల్‌ పేర్కొన్నారు. అనిల్‌ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపితీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఈ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బిజెపి మధ్యప్రదేశ్‌ చీఫ్‌ రాకేశ్‌ సింగ్‌..అనిల్‌ను ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/