అన్నాడిఎంకె నుంచి ఇద్దరికి మంత్రి పదవులు?

ravindranath kumar, vydyalingam
ravindranath kumar, vydyalingam

చెన్నై: ప్రధాని మోది నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో అన్నాడిఎంకేకు చెందిన ఇద్దరికి సహాయ మంత్రుల పదవులు కేటాయించాలని అధికారపార్టీ డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. తేని పార్లమెంటు సభ్యుడు రవీంద్రనాథ్‌ కుమార్‌, అన్నాడిఎంకే సీనియర్‌ నేతలలో ఒకరైన వైద్యలింగం పేర్లను అన్నాడిఎంకే ప్రతిపాదించింది. ఢిల్లీ రాజ్యసభలో బిజెపికి ప్రత్యేక మెజార్టీ లేని నేపథ్యంలో అన్నాడిఎంకేకు 12 మంది ఎంపీలు ఉన్నారు. అందుకే తమ పార్టీకి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని అన్నాడిఎంకె సీనియర్‌ నేతలు కోరుతున్నారు. ఇదే కోరికను సియం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంలు కూడా ప్రధాని మోది వద్ద ప్రస్తావించారని, అందుకు ఆయన అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/