కనిమొళి ఇంట్లో ఏమి దొరకలేదట..

‘తప్పుడు సమాచారం ఇచ్చారు’ అంటూ వెల్లిపోయిన ఐటి అధికారులు!

kanimozhi
kanimozhi

చెన్నై: తమిళనాడులో డిఎంకే నేత కనిమొళి ఇంట్లో జరిగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో ఏమీ లభించలేదు. తూత్తుక్కుడి లోని అమె ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బును దాచారని, ఎన్నికల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో అధికారులు సోదాలు చేశారు. అయితే, సోదాల అనంతరం అధికారులు ఉత్త చేతులతో వెళుతూ, తమకు తప్పుడు సమాచారం అందిందని వ్యాఖ్యనించడం గమనార్హం. తనిఖీల తరువాత కనిమొళిపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, ఈ సోదాలపై స్పందించిన కనిమొళి, ఎన్నికల కమిషన్‌, ఆదాయపు పన్ను శాఖ మోదీ కూటమిలో భాగమయ్యాయని ఆరోపించారు. విపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేయడమే మోడీ ఉద్దేశమని మండిపడ్డారు. రాష్ట్ర బిజెపి చీఫ్‌ తమిళ సాయి సౌందరరాజన్‌ ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బు ఉందని, ఆమె ఇంట్లో దాడులు ఎందుకు జరగడం లేదని కనిమొళి ప్రశ్నించారు. కాగా, రెండో దశలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌ సభ ఎన్నికలు గురువారం జరగనున్న సంగతి తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/