మోదిపై, రాజ్నాథ్పై అభినందన్ పాథక్ పోటీ!

లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నో నియోజకవర్గం నుంచి ఛోటా మోది నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఛోటా మోది ఎవరనుకుంటున్నారా? ఐతే తెలుకోవాల్సిందే. ప్రధాని మోది పోలికలతో కనిపించే అభినందన్ పాథక్, కేంద్రమంత్రి, సీనియర్ బిజెపి నేత రాజ్నాథ్ సింగ్కు పోటీగా బరిలోకి దిగుతున్నారు. మరో విశేషమేమంటే ప్రధాని మోది పోటీ చేస్తున్న వారణాసిలో కూడా ఏప్రిల్ 26న ఈ ఛోటా మోది నామినేషన్ వేయనున్నట్టు వెల్లడించారు. స్నేహితులు పాథక్ను అలానే పిలుస్తారు. వారణాసిలో మే 19, లక్నోలో మే 6న పోలింగ్ జరగనుంది. రాజ్నాథ్ సింగ్ ఏప్రిల్ 16న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/