91 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌

తొలి విడతలో 20 రాష్ట్రాలలోని
91 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌

First Phase Polling
Young Voters

న్యూఢిల్లీ: దేశం మొత్తం మొదటి విడత లోక్‌ సభ ఎన్నికలకు సిద్ధంఅయింది. సాయుధ బలగాలు తరలి వెళ్లాయి. ఎన్నికల సిబ్బంది రిటర్నింగ్‌ అధికా రులు తమతమ సామగ్రిని తీసుకుని తరలివెళ్లారు. పోలింగ్‌కేంద్రా లవద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. తొలివిడత పోలింగ్‌ 18 రాష్ట్రాల్లోను, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలనుంచి సాయంత్రం ఆరుగంటలవరకూ పోలింగ్‌ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరమ్‌, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్‌, నికోబార్‌ దీవులు, లక్ష్దద్వీప్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మొదటిదశలోనే పోలింగ్‌ జరుగు తోంది. వీటితోపాటు అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ జమ్ము కాశ్మీర్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిశా, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌ పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా మొదటి విడత పోలింగ్‌లో కొన్ని నియోజక వర్గాలున్నాయి. మొత్తం 91 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అంధ్రప్రనదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌లో 96 మందిఅభ్యర్ధులు ముగ్గురు కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు. జనరల్‌ వికెసింగ్‌, సత్యపాల్‌సింగ్‌, మహేష్‌శర్మలు ఈదశలోనే పోటీచేస్తున్నారు. ఆరఎల్‌డి చీఫ్‌ అజిత్‌సింగ్‌, బిజెపి నేత సంజీవ్‌ బల్యాన్‌, కాంగ్రెస్‌ నేతిమ్రాన్‌ మసూద్‌,తబుస్సుంబేగమ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. మొత్తంగాచూస్తే మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారిపైనే ఎక్కువగా పార్టీల హైకమాండ్‌లు దృష్టిపెట్టాయి.