టీడీపీ లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చేరిక

విజయవాడ : జగన్‌కు షాక్‌ ఇచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేఎం చంద్రబాబు సమక్షంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య టీడీపీలో చేరారు. టీడీపీ కండువా కప్పి ఐజయ్యను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఐజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఐజయ్య చెప్పారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం