ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్‌ నామినేషన్‌ తిరస్కృతి

ka paul
ka paul


భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు ఆయన ఆలస్యంగా రావడంతో అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా పాల్‌ మాట్లాడుతూ..నామినేషన్‌ వేసేందుకు వచ్చిన తనను అధికారులు సమయం లేదంటూ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తరఫున ఓ ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లాడన్నారు. అనంతరం కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికి సమయం అయిపోయిందంటూ తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమీషనర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాను నామినేషన్‌ వేయకుండా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను భీమవరంలో పోటీ చేస్తున్నానంటే పవన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తన పార్టీ గుర్తు హెలికాప్టర్‌ కావడంతో తుప్పు ఫ్యాన్‌కు ఓట్లు పడవన్నారు.