ఇసి ఎవరికొమ్ము కాయదు: ద్వివేది

G K dwivedi
G K dwivedi

విజయవాడ,: ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఈవో ద్వివేది వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ముకాయట్లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకో సహకరించాలని ఆదేశించడంలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునురుద్ఘాటించారు.
ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల పట్ల రాజకీయ పార్టీగా టీడీపీ మరోసారి పునరాలోచించుకోవాలని ద్వివేది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమ మీద ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.