ఓటరుపై చేయి చేసుకున్న కొడాలి నాని

kodali nani
kodali nani

గుడివాడ: ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రెచ్చిపోతున్నారు. అధికార టిడిపి నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పాల్పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్టాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నా వైఎస్‌ఆర్‌సిపి డబ్బు పంపిణీ చేస్తున్నారు. డబ్బు పంపిణీ విషయంలో కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం తలెత్తింది. దీంతో రంగ ప్రవేశం చేసిన వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కొడాలి నాని ఓటర్లపై చేయి చేసుకున్నారు. దీంతో వాళ్లంతా అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/