రాష్ట్రాల సిఇఒలు ఉత్సవ విగ్రహాలేనా!

ఇసి ఎందుకు ఇలా దిగజారుతోంది
శేషన్‌ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నారు..

ECI-
ECI-

హైదరాబాద్‌: అవును ఎన్నికలు-ప్రచారం, పోలింగ్‌ అంటే దేశ ప్రజలందరికీ గుర్తువచ్చేది టిఎన్‌ శేషన్‌. ఎన్నికల సమయంలో ఆయనంతగా ప్రాచుర్యంలోకి వచ్చిన మరోఅధికారి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి)లో గతంలో లేరు. ఆయన రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా మరో అధికారిని ఆ స్థాయిలో ఓటర్లు గుర్తుంచుకోలేదు.కాగా ప్రస్తుత ఎన్నికల సంఘంపై ఎందుకో మరిన్ని విమర్శలు వస్తూ, సిఇసి అంటేనే పక్షపాత వ్యవస్థగా చెడ్డపేరు తెచ్చుకుంటున్నది. భారత ప్రజాస్వామ్య పరిర క్షణకు మూలాధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తన విధ్యుక్త ధర్మాని నిష్పక్షపాతంగా నిర్వర్తిం చాల్సి ఉండగా, అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారిందనే ఆరోపణలను ఎదుర్కొంటు న్నది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు విశ్వసనీయ సంస్థగా ఉండాల్సిన సిఇసి ఒక కూటమికో పార్టీకో కొమ్ముకాస్తున్నదనే అప్ర తిష్ఠను మూటకట్టుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవు తున్నది. శేషన్‌కు ఉన్న అధికారాలే గతంలోనూ, ప్రస్తుతం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయి. అయినప్పటికీ ఈ సిఇసిలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రధాన కమిషనర్‌, కమిషనర్లు రాజకీయ నేతల గుండెల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి కాకుండా అధికార పార్టీ ఆదేశాలకను గుణంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం పెరగడా నికి ఆస్కారం కల్పిస్తున్నట్లుగా అనుమానించే విధంగా ఉన్నట్లుగా 66 మంది సీనియర్‌ బ్యూరోకాట్లు అభిప్రాయపడటం సిఇసిని దిగజా ర్చినట్లే. ప్రతిపక్షాలు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో ఒక విధంగా, కేంద్రంలోని అధికార పార్టీకి అను కూలంగా ఉన్న రాజకీయ పార్టీల విషయంలో మరో రకంగా సిఇసి నిర్ణయాలు తీసుకుంటున్న దని స్వయంగా ఒక ముఖ్యమంత్రి ధర్నా చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిరసన తెలపడం జాతీయ స్థాయిలో చర్చనీ యాంశం కాగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సిఇసిని తప్పుపడుతున్నారు. శేషన్‌ ఈ పదవిని అలంకరించిన తర్వాత ఇతర ఏ సిఇసి ప్రధాన కమిషనర్‌ కూడా సంస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడలేకపోయారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు.
పదో ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా డిసెంబర్‌ నెల 1990 పదవీ బాధ్యతలు స్వీకరించిన శేషన్‌ 1996 వరకు కొనసాగారు. ఆయన పదవీ కాలంలో దేశ ప్రధానులుగా విపి సింగ్‌, చంద్ర శేఖర్‌, పివినర్సిహారావు, వాజ్‌పేయి, దేవగౌడలు కొనసాగిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ప్రస్తుతం సిఇసి విశ్వసనీ యత పతనావస్థకుచేరి, ఈ సంఘం నిజాయి తీపై ప్రజలు నమ్మకం కోల్పేయే పరిస్థితి నెల కొంది. సర్వస్వతంత్రంగా, నిజాయితీతో, నిష్పక్ష పాతంగా, సమర్థతతో వ్యహరించే అవకాశా లున్నా, వాటికి తిలోదకాలిస్తున్నదనే విమర్శలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మవుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లో అన్ని స్థాయిల్లోని అధికార యంత్రాంగం అంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమతమ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జిఒలు జారీచేస్తాయి. కాగా ఎన్ని కల్లో కీలక బాధ్యతలు నెరవేర్చాల్సిన పోలీసు శాఖలో కానిస్టేబుల్స్‌ నుంచి డిజిపి వరకు ప్రతి స్థాయి అధికారి ఎన్నికల కమిషన్‌ చెపుచేతల్లోనే తమ విధులను నిర్వహించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్య అధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సిఇసి పరిధిలోకి వస్తారు. కేంద్ర ప్రభుత్వంలోనూ ఇదే విధంగా అందరు అధికారలు ,సంబంధిత సిబ్బంది సిఇసి ఆదేశాలను పాటించాల్సిందే.