రంజాన్‌ నెల మొత్తం ఎన్నికలు జరపకుండా ఉండలేం

Election Commission of India
Election Commission of India

హైదరాబాద్‌: రంజాన్‌ నెలంతటా ఎన్నికల ప్రక్రియను నిర్వహించకుండా ఉండలేమని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే రంజాన్‌ పండగ, శుక్రవారాల్లో పోలింగ్‌ జరగకుండా మినహాయించినట్టు పేర్కొంది. ఏడు దశల్లో పోలింగ్‌ జరపడం వల్ల రంజాన్‌ ఉపవాసాలు చేసే ముస్లింలకు ఇబ్బందికరంగా ఉంటుందంటూ కోల్‌కతా మేయర్‌ ఫిర్హాద్‌ హకీం అభ్యంతరం తెలిపిని విషయం తెలిసిందే. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం రంజాన్‌ నెలలో ఎన్నికల నిర్వహణను స్వాగతించారు. ఈ నెలలో ముస్లింలు దైవభక్తితో మెలుగుతారని, అందువల్ల పోలింగ్‌ శాతం పెరుగుతుందన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/