ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

అక్టోబ‌ర్ 4న ఆరు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబ‌ర్ 4న ఆరు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బెంగాల్‌, అసోం, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక్కో రాజ్య‌స‌భ స్థానానికి, త‌మిళ‌నాడులో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

నామినేష‌న్ల ప్ర‌క్రియ ఈ నెల 15న ప్రారంభ‌మై.. 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 27. అక్టోబ‌ర్ 4వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/