ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియలో మార్పు ఉండదు

ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియలో మార్పు ఉండదు
Election Commission
Election Commission

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం విపక్షాలకు షాకిచ్చింది. ఈవీఎంలను లెక్కించడానికి ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు ఈసీని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో మార్పు ఉండ‌ద‌ని ఇవాళ ఈసీ స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఆ త‌ర్వాత ఈవీఎంలు, చివ‌ర‌గా వీవీప్యాట్ల‌ను లెక్కించ‌నున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/