షిర్టీ ఆలయంపై లాక్‌డౌన్‌ ప్రభావం

జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే రూ. 150 కోట్ల నష్టం

SAI BABA , SHIRDI
SAI BABA , SHIRDI

షిర్టీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో పలు ఆలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ ఆలయాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఈతరుణం నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే షిర్డీ సాయి ఆలయం కూడా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ప్రతి రోజు రూ. 1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోతోంది. మార్చ్ 17 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో ఆలయానికి రూ. 2.53 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. రోజుకు దాదాపు రూ. 6 లక్షలు మాత్రమే వచ్చింది. కాగా షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రతిరోజు సరాసరి రూ. 1.64 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్ డౌన్ కారణంగా ప్రతి ోజు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే టెంపుల్ ట్రస్ట్ ఏకంగా రూ. 150 కోట్ల మేర నష్టపోతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/